కార్మికుల కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడనున్న నితిన్ గడ్కరీ

Nitin Gadkari speak with CM KCR for RTC workers

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను మాట్లాడతానని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు . సమ్మెపై అధికారులు సంబంధిత మంత్రితో చర్చిస్తానని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, మంత్రి కిషన్‌రెడ్డిలు నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆర్టీసీ సమ్మె పై జోక్యం చేసుకుంటానని తెలిపారు. అయితే ఆర్టీసీ సమస్యపై కేంద్రానికి జోక్యం చేసుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏసుప్రభు ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికులపై కక్షసాధింపు ధోరణి వదిలిపెట్టి సానుకూలంగా స్పందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఇదే అంశంపై బీజేపీ ఎంపీలు సైతం మాట్లాడారు. బిజెపి ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం తీసుకున్న ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ సానుకూల దృక్పధాన్ని చూపించాలని, సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని , తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆర్టీసి సమ్మె విరమణ విషయంలో కూడా ఆర్టీసీ కార్మిక జేఏసీ అందరి కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు బీజేపీ ఎంపీలు. ఎందుకంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అన్న భావన కార్మికులలో వ్యక్తమవుతోందని వారన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలు, బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరిన మీదట నితిన్ గడ్కరీ చొరవ చూపుతానని, ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని పేర్కొన్నారు.

tags : ts rtc strike, rtc strike, rtc jac, ashwatthama reddy, rtc workers union, cm kcr, telangana, government, bjp mp, bjp minister, kishan reddy, nithin gadkari

ప్రమాదంలో శ్రీశైలం డ్యాం..

టీడీపీకి షాక్ ఇస్తూ వంశీ బాటలో మరో నేత ?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article