రేవంత్ కి బెయిల్ ఇప్పుడు లేనట్టే

129
no bail for revanth
no bail for revanth

no bail for revanth

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి  కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్  చిత్రీకరణ  కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  డ్రోన్ కెమెరా వినియోగించారన్న కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని, తనపై నమోదైన కేసు కొట్టి వెయ్యాలని ,మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని,  మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరిన ఆయన  మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రేవంత్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. మిగిలిన రిమాండ్, ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే రేవంత్ అంశంపై అటు పార్లమెంట్‌లోనూ తీవ్ర దుమారం లేపింది. ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేయడం చట్ట విరుద్ధమని టీఆర్ ఎస్ ఎంపీ పార్లమెంట్ లో సమాధానం చెప్పారు.ఇక మరో రెండు పిటీషన్లపై వాదనలు జరగనున్న నేపధ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటీషన్లపై కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది.

ts politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here