క్యాబినెట్ ఆశావహులకు షాక్ ఇచ్చిన యడ్యూరప్ప

116
No Changes In BS Yeddyurappas Cabinet
No Changes In BS Yeddyurappas Cabinet

No Changes In BS Yeddyurappas Cabinet

కర్ణాటక లో కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులకు యడ్యూరప్ప షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్ళు చల్లారు . క్యాబినెట్ విస్తరణ మాత్రమే చేస్తామని,పునర్వ్యస్థీకరణ  చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. కొత్తగా మంత్రులను చేర్చుకోవడమే ఇతర మార్పు చేర్పులు ఉండవని ఆయన స్పష్టత ఇచ్చారు. విస్తరణ మాత్రమే జరుగుతుందని పునర్వ్యస్థీకరణ కాదని ఆయన ప్రకటించారు.  విస్తరణ అంటే.. ఇటీవల ఉప ఎన్నికల్లో నెగ్గిన పదిమంది ఎమ్మెల్యేలనూ మంత్రులుగా చేయడం అలాగే పార్టీలోని పాత వాళ్లు ముగ్గురిని మంత్రులు గా తీసుకోవడం. ఇలా తన కేబినెట్లోకి కొత్త వారు చేరుతారు తప్ప ఉన్న వారి స్థానాలు మారవని యడియూరప్ప ప్రకటించారు. కేబినెట్ సమూలంగా మారుతుందని కొందరు బీజేపీ నేతలు ఎక్స్ పెక్ట్ చేశారు. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. కొందరికి అనూహ్యంగా మంత్రి పదవులు దక్కాయి. వారిలో ఎమ్మెల్యేలు గా నెగ్గని వారు కూడా ఉన్నారు. అలాంటి ఒకరిద్దరు మంత్రులు కావడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఒకరు సొంతం చేసుకున్నారు. అలా అనూహ్యం గా అవకాశం పొందిన కొందరిని ఇప్పుడు తప్పిస్తారని పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో కొందరికి అవకాశాలు లభిస్తాయని పార్టీలోని పాత కాపులు భావించారు . ముగ్గురు మంత్రులను తొలగిస్తారని వారి స్థానంలో వేరే వాళ్లకు అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రచారాలకు యడియూరప్ప చెక్ పెట్టారు.

No Changes In BS Yeddyurappas Cabinet,yadiyurappa , karnataka, cabinet expansion, asparents , bjp,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here