కోవర్టు రాజకీయాలు తనకు రావని.. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.
తనను బద్నాం చేసేందుకే అలాంటి ప్రచారం చేస్తూ న్నారని చెప్పారు. లావుగా మార్కర్ ఉండటంతో చేయి జారీ బ్యాలెట్ పేపర్ పైన మార్క్ పడిందని.. అభ్యర్ధుల పేర్లు ఉన్న దగ్గర మార్క్ పడలేదన్నారు. ఓటు చెల్లదనే ఉద్దేశ్యంతో మరో బ్యాలెట్ పేపర్ అడిగానని.. కుదరని చెప్పడంతో అదే బ్యాలెట్‌పై ఓటు వేశానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు తాను ఓటు వేసానని చెప్పారు.
కోవర్టు రాజకీయాలు రావు
