పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఉండదు

NO CRICKET WITH PAK

  • ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టీకరణ

పుల్వామాలో ఉగ్రదాడికి తెగబడి 42 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ పై మనదేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా దాయాదిని ఏకాకిని చేసే విషయంలో దాదాపు విజయం సాధించిన భారత్.. ఆ దేశాన్ని దారిలోకి తెచ్చేందుకు అవసరమైన ఏ ఒక్క అంశాన్నీ వదలడంలేదు. దాయాది నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువులపై 200 శాతం పన్ను విధించడమే కాకుండా పాక్ కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కూడా ఉపసంహరించుకున్నాం. తాజాగా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే అవకాశం ఎంతమాత్రం లేదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పుల్వామా ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదన్నారు. వాస్తవానికి క్రీడలకు ఈ పరిణామాలతో సంబంధం ఉండదని, కానీ ఎవరైనా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటే… దాని ప్రభావం కచ్చితంగా క్రీడలపై పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే ప్రపంచ కప్‌లో పాక్‌తో భారత్ ఆడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రపంచకప్‌కు ఇంకా చాలా రోజుల సమయం ఉందని, అప్పటిలోగా ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article