నో డ్రంక్ అండ్ డ్రైవ్

TELANGANA POLICE DEPARTMENT DECIDED TO STOP DRUN N DRIVE CHECKS TEMPORARILY, DUE TO INCREASED COVID CASES

45
NO DRUNK AND DRIVE CHECKS NOW
NO DRUNK AND DRIVE CHECKS NOW

శని, ఆదివారాలు వస్తే చాలు.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బిజీబిజీగా ఉంటారు. వివిధ రకాల మందు బాబుల విన్యాసాలు చూస్తూ.. నవ్వుకుంటూ.. బీపీ తెచ్చుకుంటూ.. ఒక ఆట ఆడుకుంటారు. అయితే, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోలీసులు చేపట్టేవారు. ఎంతో ఉత్సాహంగా జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసు శాఖ అనధికారిక నిర్ణయం తీసుకుంది. కారణం.. ఈ కార్యక్రమం వల్ల పోలీసు శాఖలో భారీగా పాజిటివ్ కేసులు పెరిగాయట. అందుకే, పోలీసులు కాస్త కష్టమైనా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన తెలిసింది. ఏదీఏమైనా మందు బాబులకు కొన్ని రోజులు రిలీఫే అని చెప్పొచ్చు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు లేకపోలేదని ప్రజలు మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here