తెలంగాణ‌లో భ‌రోసా లేదా?

23
No Lockdown In Telangana
No Lockdown In Telangana

No Hope For Covid In Telangana?

* కొవిడ్ నుంచి సామాన్యుల్ని ర‌క్షించ‌డంలో
   ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందా?
* విప‌త్క‌ర స‌మ‌యంలో హ‌రిత‌హారం,
   స‌చివాల‌యం కూల్చివేత నాన్సెన్స్
* ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌జ‌లు

కొవిడ్ స‌మ‌యంలో హ‌రిత‌హారం చేయ‌డ‌మో నాన్సెన్స్ అని‌.. స‌చివాల‌యం కూల్చితే నాన్సెన్స్‌న్న‌ర అని ప్ర‌జ‌లు అంటున్నారు. అస‌లు గ‌త ఐదేండ్ల‌లో ఈ హ‌రిత‌హారం పేరిట ఎన్ని మొక్క‌లు నాటారు? ఎన్ని బ‌తికాయి? ఎంత శాతం ప‌చ్చ‌ద‌నం పెరిగింది? ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో ప్ర‌భుత్వం తెలియ‌జేయాల‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. స‌చివాల‌యం ఈ ఏడాది కాక‌పోతే వ‌చ్చే ఏడాది కూల‌గొట్టుకుంటే ఎవ‌రైనా కాద‌న్నారా? అయినా దొంగ‌ల్లా అర్థ‌రాత్రి పూట కూల్చివేత‌ లేమిట‌ని నిల‌దీస్తున్నారు. ఇదే సచివాలయాన్ని ఎలాగూ కూల్చివేస్తారు క‌దా.. కొవిడ్ ఆస్ప‌త్రిగా తాత్కాలికంగా మార్చివేస్తే ఎంత‌మంది అమాయ‌కుల ప్ర‌జ‌ల ప్రాణాలు ద‌క్కేవి? ఈ రోజు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లేమో పేషెంట్ల‌ను చేర్చుకుంట‌లేవు.. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లేమో ల‌క్ష‌లుంటే తప్ప బెడ్లు ఇవ్వ‌డం లేదు. చేతిలో సొమ్ము ఉన్నా.. ఎవ‌రో ఒక‌రు భారీ స్థాయిలో పైర‌వీ చేయించుకుంటే త‌ప్ప ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌లు దొర‌క‌డం లేదు. ఈ కొవిడ్ స‌మ‌యంలో కేటీఆర్ ఎంత‌మందికి ట్విట్వ‌ర్ ద్వారా జ‌వాబులిచ్చి ప్ర‌జ‌ల ప్రాణాల్ని ర‌క్షిస్తున్నారు? కొవిడ్ వ‌చ్చిన కొత్త ఏదో ప‌బ్లిసిటీ స్టంట్ చేశారు క‌దా.. మ‌ళ్లీ ఇప్పుడెందుకు చేయ‌డం లేద‌ని నిల‌దీస్తున్నారు.

* గాంధీ ఆస్ప‌త్రిలో కూడా కేవ‌లం ప‌ర‌ప‌తి ఉన్న‌వాళ్ల‌కోస‌మే బెడ్లు ఖాళీగా ఉంచుతున్నారే తప్ప సామాన్యుల‌కు ఇవ్వ‌డం లేద‌ని అధిక శాతం మంది ప్ర‌జ‌లు వాపోతున్నారు. అస‌లు నేరుగా వెళితే బెడ్లు దొర‌క‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆస్ప‌త్రి బ‌య‌టే సెక్యూరిటీ గార్డులు బెడ్లు ఖాళీగా లేవంటూ వెళ్ల‌గొడుతున్నార‌ని.. ఎవ‌రో ఒక‌రితో చెప్పిస్తే త‌ప్ప ప‌డ‌క‌లు దొర‌క‌ని దుర్ల‌భ‌మైన ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని అంటున్నారు. అంద‌రికీ కేటీఆర్ వ‌ర‌కూ యాక్సెస్ ఉండ‌దు క‌దా. హైద‌రాబాద్‌లో చాలా ప్ర‌మాదం నెల‌కొన్న‌ది. గ‌చ్చిబౌలిలో టిమ్స్ ఆస్ప‌త్రి ఏర్పాటు చేస్తే కొవిడ్ స‌మ‌స్యకు కొంత ప‌రిష్కారం ల‌భిస్తుంది. కాక‌పోతే, అక్క‌డ డాక్ట‌ర్లు, న‌ర్సుల‌ను నియ‌మించుకోవాలి. వీరిని నియ‌మించ‌కుండా ఇంత‌వ‌ర‌కూ కాల‌యాప‌న చేయ‌డం క‌రెక్టు కాద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. మార్చి 22 నుంచి లాక్ డౌన్ విధించారు.. మ‌రి, అప్ప‌ట్నుంచి ఆస్ప‌త్రిని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం, అందులో ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేయక‌పోవ‌డం, సిబ్బందిని నియ‌మించ‌క‌పోవ‌డం సిగ్గులేనిత‌న‌మ‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా వంటి దేశాల‌ను సంప్ర‌దించి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న తెప్పిస్తే ఎంత బాగుంటుంద‌ని అంటున్నారు. మొత్తానికి, తెలంగాణలో కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ద‌ని, ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వ‌లేక‌పోతుంద‌ని ప్ర‌జ‌లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రిస్థితిలో మార్పు రావాల‌ని ప్ర‌తిరోజు దేవుడిని కోరుకుంటున్నారు.

Is Telangana Government Failed?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here