దర్జాగా తిరుగుతున్నారు!

No Mask, No Social distance

ఎక్కడా చూసినా జనమే జనం. నో మాస్కు, నో సోషల్ డిస్టెన్సు. అసలు కరోనా అంటూ ఒక్కటి ఉంది అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. బట్టల షాపులు, స్వీట్ షాపులు, కిరాణ కొట్లు, చిరు వ్యాపారుల అడ్డా… ఇలా ప్లేస్ ఏదైనా జనమే జనం. ఇష్టామొచ్చినట్టు తిరుగుతున్నారు. ఇక దసరా పండుగ సమీపిస్తుండటంతో జనం దర్జాగా తిరుగేస్తున్నారు. పండుగ కన్నా ప్రాణం ముఖ్యం అని అధికారులు మొత్తుకుంటున్నా… ఇవేమీ పట్టించుకోవడం లేదు.

నో మాస్కు.. నో దూరం

తెలంగాణవాళ్లకు పెద్ద పండుగ ముందుగా గుర్తొచ్చేది దసరా. బతుకమ్మ పాటలతో పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ కారణంగా మళ్లీ సందడి మొదలైంది. దసరా, ఆ తర్వాత దీపావళి. ఇకేముంది ఎక్కడా చూసిన జనం. దీనికి తోడు పలు వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే, వ్యాపార సంస్థలు పూర్తిగా ఎంతో కొంత ఆదాయం సమకూర్చుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పండుగ సీజన్ లోపడి జనాలు మాస్కులు ధరించడం లేదు. కనీసం భౌతిక ధూరం పాటించడం లేదు. ఇక దుబ్బాక ఎలక్షన్స్ లో అసలు కరానో లేదంటూ నేతలు పర్యటిస్తున్నారు. వాతావరణం చల్లబడటం, వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి.

జాగ్రత్తలు లేకుండానే ప్రయాణాలు

పండుగ సీజన్ మొదలుకావడంతో పట్నంవాసులు పల్లెబాట పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇందుకోసం కొందరు తమ సొంత వాహానాలపై వెళ్తుంటే, మరికొందరు ప్రైవేట్, పబ్లిక్ వాహానాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణంలో ఎక్కడా కూడా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటికైనా కనీస జాగ్రత్తలు పాటించకుంటే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article