దేశంలో 35 శాతం మంది పిల్లలు పౌష్టికాహర లోపంతో భాదపడుతున్నారని అందుకే విద్యార్ధుల మధ్యాహ్న భోజన పథకం లో మరిన్ని పోషకాలు అందేలా…. సరికొత్తగా పీఎం పోషణ్ అనే పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ లో ప్రవేశపెట్టారు. ఏడాది గడుస్తున్నా…అదనపు పోషకాలను అందించే ఒక్క వస్తువును మిడ్ డే మిల్స్ లో చేర్చ లేదు. ప్రోటీన్లు, కాలరీస్ పెంచే చర్యలు లేవు.
పైగా రెండేల్ల క్రింత నిర్ణయించిన భోజనపు ధరలనే చెల్లిస్తుండటంతో పిల్లలకు సరిగా తిండిపెట్టలేకపోతున్నారు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు , కారం, నూనే, గ్యాస్ బండ ధరలు భారిగా పెరిగినా..మధ్యాహ్న భోజన పథకానికి అయ్యే ఖర్చులను నయా పైసా పెంచకపోవడంతో నీల్ల చారుతోనే నెట్టుకరావాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాలు, దయగల్ల పంతుల్లు బలహీన పిల్లలను చూడలేక సొంత డబ్బులతో కూరగాయలు, గుడ్డు, పాలు సమకూరుస్తున్నారు.
ప్రతి భోజనానికి అయ్యే ఖర్చును చివరగా మే 2020 లో సవరించారు
1నుంచి 5వ తరగతి విద్యార్ధుల భోజనానికి సగటున రూ. 4.97 (కేంద్రం రూ. 2.98, రాష్ట్రాలు రూ. 1.99), 6-8వ తరగతి విద్యార్ధులకు రూ. 7.45 (కేంద్రం రూ. 4.47, రాష్ట్రాలు రూ. 2.98) చెల్లిస్తున్నాయి.
ఈ రెండేల్లలో నిత్యవసర సరుకుల ధరలు పెరిగినప్పటికీ..పర్ మీల్ రేట్లు పెంచకపోవడంతో పోషకాలు కాదు కదా..కనీసం పిల్లల పొట్ట నిండటం లేదు. అంత దానికి పీఎం పోషణ్ అని పేరు మార్చడం దేనికో?