వేతన జీవికి ఊరటే

NO TAX UP TO FIVE LAKH

  • రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు

కేంద్రం బడ్జెట్ పెడుతుంటే.. ఏయే వస్తువులు తగ్గాయ్, ఏవి పెరగాయ్ అనే లెక్కలతోపాటు ఆదాయపు పన్నులో ఏమైనా కలిసొచ్చిందా లేదా అని సగటు మధ్యతరగతి ప్రజానీకం చూస్తుంటారు. రైతులు, అసంఘటిత రంగాల కార్మికులతోపాటు సగటు వేతన జీవికీ తాజా బడ్జెట్ లో మోడీ సర్కార్ ఊరటనిచ్చింది. రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చింది. సెక్షన్‌ 87–ఏ కింద లభించే పన్ను రిబేటును పెంచడంతో చిన్న వేతనజీవుల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతోంది. వాస్తవానికి రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ, కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రూ.10 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు లభించేది. ఇప్పడు దీనిని రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. ఇప్పుడు వీటికి అదనంగా సెక్షన్‌ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ మరో రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్‌పీఎస్‌కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఒక్క రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడ టాక్సబుల్ ఇన్ కమ్ రూ.5 లక్షలు దాటితే మాత్రం రిబేటు వర్తించదు. అప్పుడు ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను లెక్కించి చెల్లించాల్సిందే. ఈ రిబేటును పెంచడంతో వార్షిక ఆదాయం రూ.5.50 లక్షలలోపు ఉన్న వారు ఎటువంటి పొదుపు చేయాల్సిన అవసరం లేకుండానే పన్ను భారం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. మొత్తమ్మీద తాజా బడ్జెట్ లో ఐటీ కింద చేసిన ప్రతిపాదనలో దాదాపు 3 కోట్ల మందికి లబ్ధి పొందుతారు.

NATIONAL

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article