విజయవాడ బంద్ తూచ్

NO VIJAYAWADA BANDH

విజయవాడ బంద్ అంతా తూచ్.. అలాంటిదేం లేదు.. కరోనా కేసులు పెరుగుతున్నా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వాస్తవానికి, జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్‌ తెలిపారు. మెడికల్ షాప్స్‌కు మాత్రమే అనుమతినిస్తామని వెల్లడించారు. ప్రజలు వారం రోజులు పాటు బయట తిరగరాదని తెలిపారు. రేపు, ఎల్లుండి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాలు కూడా వారం రోజులు పాటు లాక్‌డౌన్‌ని పాటించాలని చెప్పారు.

VIJAYAWADA SHUT DOWN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *