పెళ్లి చేసుకున్న నోయెల్‌, ఎస్త‌ర్

Noel and Estar Marraied together
న‌టుడిగా, సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న నోయెల్ సేన్,  వెయ్యి అబ‌ద్దాలు చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఎస్త‌ర్ నోరోన్హా గ‌త ఏడాది కాలంగా డేటింగ్ ఉన్నారు. రీసెంట్‌గా వీరి నిశ్చితార్థం కూడా జ‌రిగింది. నేడు ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివార‌య్యారు. మంగ‌ళూరులోని ఓ చ‌ర్చిలో క్రైస్త‌వ ప‌ద్ధ‌తిలో జ‌రిగిన వీరి పెళ్లికి రాజ‌మౌళి, ర‌మా రాజ‌మౌళి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరి పెళ్లి ఫోటోను నోయెల్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ త‌న హృద‌యానికి ఎస్త‌ర్ మ‌హారాణి అని.. అంద‌రూ ఆశీస్సులు కావాల‌ని నోయెల్ కోరారు. నోయెల్‌, ఎస్త‌ర్ క‌లిసి ఓ ఆల్బ‌మ్‌లో న‌టించారు. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింది. కొంత‌కాలం పాటు డేటింగ్‌లో ఉండి ఈ ఏడాది వివాహం చేసుకున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article