విమానంలో వచ్చి దొచేస్తాడు

33
Noida thief arrested by Hyderabad Police
Noida thief arrested by Hyderabad Police

Noida thief arrested by Hyderabad Police

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం కొంతమందికి అలవాటుగా మారింది. ఈ ఫొటోలో కనిపించే దొంగ కూడా అలాంటివాడే. నోయిడాలో ఉంటూ విమానంలో హైదరాబాద్‌ వచ్చి పట్టపగలు చోరీలు చేస్తాడు. పగటి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఆ తర్వాత విమానంలోనే నోయిడాకు ఉడాయిస్తాడు. మచ్చబొల్లారం ప్రాంతంలోని చాలామందికి ఇతడు పరిచయం కూడా. ఈ ఘరనా దొంగ అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో రెండు, కీసర పీఎస్‌ పరిధిలో రెండు చోరీలకు పాల్పడ్డాడు.

శుక్రవారం (నిన్న) ఈ దొంగను బాలానగర్‌ ఎస్‌ఓటీ బృందం అరెస్ట్‌ చేసింది. చత్తీస్‌ఘడ్,  కుమారీ టౌన్‌ దుర్గ్‌ జిల్లాకు చెందిన గిరి గంగాధర్‌ అలియాస్‌ గొడుగు గంగాధర్‌ నోయిడాలోని సెక్టార్‌ 37లో ఉంటూ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలానగర్‌ ఎస్‌ఓటీ బృంధం నోయిడా వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి 40 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here