shraddha Not Responding ? why ?
శ్రద్ధా కపూర్ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్. ఆమె ఓ వైపు `సాహో`లో ప్రభాస్ సరసన నటిస్తోంది. మరోవైపు టెన్నిస్‌క్రీడాకారిణి సైనా బయోపిక్‌లో నటిస్తోంది. ఇంకో వైపు చిచ్చూర్, స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రాల్లో నటిస్తోంది. వీటన్నిటికీ మధ్య ఆమెకు టైమే సరిపోవడం లేదు. అయినా ఓ కొత్త ప్రాజెక్ట్ మీద మనసు పడ్డది. ఆ ప్రాజెక్ట్ పేరు `బోలే చుడియాన్`. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మెయిన్ పాత్రలో కనిపిస్తారు. ఆయన సోదరుడు షామాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకత్వం వహించనున్నారు. అతను ఇంతకు ముందు `మియాన్ కల్ ఆనా` అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికి 34 చలనచిత్రోత్సవాలకు వెళ్లింది. దాదాపు 10 అవార్డులను దక్కించుకుంది. తాజా `బోలే చుడియాన్`లో శ్రద్ధ కోసం ఆయన చాలా మంచి పాత్ర చేశారట. పాత్ర ను డిజైన్ చేసిన విధానం నచ్చిన శ్రద్ధ సినిమా చేయడానికే మొగ్గుచూపుతోందట. కానీ `ఏబీసీడీ3` కోసం డ్యాన్స్ ప్రాక్టీస్, మరో వైపు సైనా సినిమా, ఇంకో వైపు `సాహో` షెడ్యూల్స్ తో బిజీగా ఉందట. అందుకే కాల్షీట్లు సర్దుబాటు సర్దుబాటు చేసే ప్రయత్నాలు సాగిస్తోందట. సో నవాజుద్దీన్ సినిమా కోసం శ్రద్ధగా పాటుపడుతోందన్నమాట.
Subscribe to YT|Tsnews.tv