బాల‌కృష్ణ త‌ర్వాత నిఖిలే!!

Now Balakrishna Next Nikhil ?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీగా చెప్పుకునే చిత్రాల్లో `ఆదిత్య 369` ఒక‌టి. ఇటీవ‌ల ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందనుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి. ఆ విష‌యాన్నిప‌క్క‌న పెడితే… టైమ్ మిష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన `ఆదిత్య 369` అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే బ్యాక్‌డ్రాప్‌లో కుర్ర హీరో నిఖిల్ కూడా సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. గ‌త ఏడాది విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో `టాక్సీవాలా` సినిమాను తెరకెక్కించి విజ‌యాన్ని సాధించిన రాహుల్ సంక్రిత్యాన్ టైమ్ మిష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ క‌థ‌ను సిద్ధం చేసి నిఖిల్‌కు వినిపించాడ‌ట‌. నిఖిల్ కూడా ఆ సినిమా చేయ‌డానికి ఆస‌క్తిగానే ఉన్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన స‌మాచారం అధికారికంగా వెలువ‌డ‌నుందంటున్నాయి సినీ వ‌ర్గాలు. అంతా అనుకున్న‌ట్లు సజావుగా సాగితే టైమ్ మిష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో బాల‌కృష్ణ త‌ర్వాత సినిమా చేసే హీరో నిఖిలే అవుతాడు మ‌రి.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article