Monday, May 12, 2025

ఎన్టీఆర్ షెడ్యూల్ చూస్తే అవాక్కే… రెండు పార్టులుగా మరో భారీ యాక్షన్ డ్రామా!

ఎన్టీఆర్ ‘దేవర’ రెండు పార్టులుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసేందుకు ‘ఎస్’ అన్నారని, అది రెండు పార్టులుగా విడుదల కానుందని టాక్. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడూ అఫీషియల్! అయితే, ఆల్రెడీ మరో రెండు సినిమాలు చేసేందుకు ఆయన ‘ఎస్’ అని చెప్పారని టాలీవుడ్ టాక్. ఒక్కటంటే ఒక్క సినిమా తీసిన దర్శకుడితో భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఫ్రాంచైజీ చేసేందుకు రెడీ అవుతున్నారట.

‘హాయ్ నాన్న’ దర్శకుడితో ఎన్టీఆర్ రెండు సినిమాలు!

నాని కథానాయకుడిగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయనతో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయనేది తెలిసిన విషయమే. అయితే… ఇప్పుడు ఆ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే… రెండు పార్టులుగా ఆ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

శౌర్యువ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కబోయేది భారీ యాక్షన్ డ్రామా అని తెలిసింది. అందులో ఫస్ట్ పార్ట్ 2026లో సెట్స్ మీదకు వెళుతుందట. ఆ సినిమాను 2028లో విడుదల చేయనున్నారట. ఇక, రెండో పార్ట్ 2031లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీని బట్టి… 2030 వరకు ఎన్టీఆర్ షెడ్యూల్ బిజీ అనుకోవాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com