ప్రభాస్ రూట్ లో ఎన్టీఆర్ ..?

23
NTR in prabhas route
NTR next NTR in prabhas route

NTR in prabhas route

ప్లానింగ్ లేకుండా పర్ఫెక్షన్ ఉండదు. మొన్నటి వరకూ మన స్టార్ హీరోలు ఒక సినిమా తర్వాత ఒకటి అంటూ చాలా కూల్ గా అనౌన్స్ లు చేశారు. కానీ ట్రెండ్ మారుతోంది. ఒక సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నారు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రాబోయే రోజులు, స్టార్డమ్ ను విస్తరించుకునే క్రమంలో సరికొత్త ప్లానింగ్స్ చేసుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ తో వచ్చే ఇమేజ్ స్పాన్ ను మరింత పెంచేలా ఈ ప్లానింగ్స్ ఉంటాయట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ను ఊపేసిన తర్వాత కొన్నాళ్లుగా క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అరవింద సమేత వీరరాఘవ అంటూ 2018లో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రాజమౌళితో సినిమా కోసం ఆగాడు. అనుకోకుండా వచ్చిన అనేక అవాంతరాలతో ఈ మూవీ ఆలస్యం అవుతోంది. రౌద్రరణరుధిరం టైటిల్ తో రాబోతోన్న ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ ఇండియన్ స్థాయికి పెరుగుతుందని వేరే చెప్పక్కర్లేదు. పైగా ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాలతో నార్త్ లోనూ మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ కు. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని గతంలోనే చెప్పారు. ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాకపోతే కరోనా అన్నిటినీ మార్చేస్తోంది. కాస్త ఆలస్యంగా వస్తాయి.

కానీ ఈ ప్రాజెక్టే ముందుగా ప్రారంభం అవుతుందంటున్నారు. అయితే ఇదే టైమ్ లో ఎన్టీఆర్.. కన్నడ దర్శకుడు కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడు అనే న్యూస్ వస్తున్నాయి. మరోవైపు తమిళ్ మాసివ్ డైరెక్టర్ ఆట్లీతోనూ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడుంటాయో స్పష్టంగా చెప్పలేకపోయినా.. ఆ ఇద్దరు దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేస్తాడు అనేది కన్ఫార్మ్ అనేది నిర్మాణ సంస్థల నుంచే వచ్చిన వార్త. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ క్యాంప్ నుంచి వినిపిస్తోన్న వార్త ఏంటంటే.. అతను కూడా ప్రభాస్ లాగానే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో డిస్కషన్స్ చేస్తున్నాడట. అతనికి ఆర్ఆర్ఆర్ కథ కూడా కొంచెం ఎక్కువగానే తెలుసట. దాన్ని బట్టి ఎన్టీఆర్ కు వచ్చే ప్యాన్ ఇండియన్ ఇమేజ్ కు అనుగుణంగా ఓ కథ సిద్ధమవుతోందనేది లేటెస్ట్ టాక్. మరి ఇదే నిజమైతే.. ఇటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేయాల్సి ఉంటుందనుకోవచ్చు. అది త్రివిక్రమ్ కు పెద్ద విషయం కాదు కాబట్టి.. ఎన్టీఆర్ కూడా రాబోయే రోజుల్లో తన మార్కెట్ ను దేశవ్యాప్తంగా విస్తరించుకునేలానే ప్రయత్నాలు చేస్తున్నాడంటున్నారు. మరి ప్రభాస్ తర్వాత టాలీవడు్ నుంచి అల్లు అర్జున్ తో పాటు బాలీవుడ్ కు మరో మాస్ స్టార్ వెళుతున్నాడనుకోవచ్చా..?

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here