ఎన్టీఆర్ కథానాయకుడికి తెలంగాణా లో షాక్

“NTR KATHANAYAKUDU” facing problems in Telangana

ఆ సినిమాపై అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. నవరస నటనా సార్వభౌముడైన నందమూరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ కథా నాయకుడు. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ప్రతిష్టాత్మక మూవీ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ రిలీజ్ కు ముందే తెలంగాణా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి సెలవులకు వస్తున్న సినిమా కావటంతో రోజుకు 6 షో లు వేసేలా తమకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది చిత్ర యూనిట్. అయితే అందుకు వీలు కాదని అర్దరాత్రి సినిమాలు అవసరం లేదని ప్రీమియర్ షో కు చెక్ పెట్టింది తెలంగాణా సర్కార్.
చాలా భారీ అంచనాలతో వస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు పై ఇప్పటికే ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్ అంతే గొప్పగా ఆ సినిమాను తెరకెక్కించారు. ఇంతవరకు ఏ సినిమాకీ పని చెయ్యనంత మంది స్టార్స్ ఈ సినిమాకు పని చేశారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఓవర్సీస్ లో హంగామా మొదలైంది. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కు ముందే జనాలు నీరాజనాలు పడుతున్నారు. 9వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్ లో నందమూరి ఫ్యాన్స్ భారీ ప్రీమియర్స్ కు సిద్ధమవుతున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాను ఎక్కువ లొకేషన్స్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే స్థాయిలో ముందురోజు అంటే జనవరి 8న ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీమియర్స్ టికెట్ ప్రైజ్ భారీ రేటు చెబుతున్నారట. ఇక ఎంత రెటినా సరే అన్నగారి బయో పిక్ చూడాలని చాలా మంది తాపత్రయపడుతున్నారట . ఆంధ్రాలో కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడు రిలీజ్ కు భారీ సన్నాహాలు చేస్తున్నారట.అక్కడ కూడా ప్రీమియర్స్ తో పాటుగా సంక్రాంతి హాలీడెస్ కాబట్టి వారం పాటు 6 షోలు వేసేలా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకుంటున్నారట.
ఇదిలాఉంటే తెలంగాణాలో మాత్రం ఎన్.టి.ఆర్ బయోపిక్ కు షాక్ తగిలేలా ఉంది. అన్ని చోట్లా బాగా ఉన్నా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఎన్టీఆర్ సినిమా ప్రిమియర్ షో లకు కాలడ్డుతోంది. ఇక్కడ అర్ధరాత్రి ప్రీమియర్ షోస్ కు చెక్ పెడుతూ నిర్ణయం తీసుకుంది . అవసరం అయితే ఎర్లీ మార్నింగ్ షోస్ వేసుకోండి తప్ప మిడ్ నైట్ షోస్ వద్దే వద్దని సీరియస్ గా చెబుతున్నారు ఇక్కడ అధికారులు . తెలంగాణా ప్రభుత్వ తీరుతో ఎన్.టి.ఆర్ బయోపిక్ కు తెలంగాణాలో రిలీజ్ ముందు షాక్ తగిలింది. ఇక్కడ ఎక్కువ షోలకు పర్మిషన్ దొరికే అవకాశం లేదని తేలిపోయింది . కావాలని తెలంగాణా ప్రభుత్వం ఎన్టీఆర్ బయో పిక్ కోసం తీసుకున్న నిర్ణయమో లేకా ఏ సినిమాకైనా ఇలాగే స్పందిస్తారో తెలీదు కానీ కాస్త వివక్షా పూరిత ధోరణి అని తెలుగు తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి ఎన్.టి.ఆర్ సినిమా దుమ్ము దులపనుంది. ఎన్టీఆర్ తో పాటుగా వి.వి.ఆర్, ఎఫ్-2, పేట సినిమాలు రిలీజ్ కానున్నాయి . కానీ ఎన్టీఆర్ కథానాయకుడు అన్నిటిలోకి విలక్షణమైన సినిమా..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article