మ‌హానాయ‌కుడు` షూటింగ్ పూర్తి

NTR MAHANAYAKU SHOOT COMPLETED
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`ను రెండు భాగాలుగా రూపొందించారు. అందులో తొలిభాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న విడుద‌లైంది. ఇందులో ఎన్టీఆర్ సినీ రంగంలో సూప‌ర్‌స్టార్‌గా ఎలా ఎదిగారు.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎందుకువ‌చ్చారు? అనే అంశాల‌ను చూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం.. అందులో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా అధికార పీఠాన్ని ఎలా చేజిక్కించుకున్నారు? ఆగ‌స్ట్ సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఎలా ద‌క్కించుకున్నార‌నే అంశాల వ‌ర‌కు `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`లో చూపించ‌బోతున్నారు. `క‌థానాయకుడు` అనుకున్న విధంగా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌హానాయ‌కుడు విష‌యంలో బాల‌కృష్ణ స‌హా యూనిట్ చాలా కేర్‌పుల్‌గా ఉన్నారు. నేటితోసినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి  ఫిబ్ర‌వ‌రి చివరి వారం లేదామార్చి మొద‌టి వారంలో విడుద‌ల చేయాల‌ని యోచిస్తున్నారు. మ‌హానాయ‌కుడు ఫలితం ఎలా ఉంటుందోన‌ని యూనిట్ వ‌ర్గాలు కాస్త టెన్ష‌న్ ఫీలవుతున్నాయి.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article