`య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` రిలీజ్?

NTR MAHANAYAKUDU RELEASE?
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`ను రెండు భాగాలుగా రూపొందించారు. అందులో తొలిభాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న విడుద‌లైంది. ఇందులో ఎన్టీఆర్ సినీ రంగంలో సూప‌ర్‌స్టార్‌గా ఎలా ఎదిగారు.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎందుకువ‌చ్చారు? అనే అంశాల‌ను చూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం.. అందులో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా అధికార పీఠాన్ని ఎలా చేజిక్కించుకున్నారు? ఆగ‌స్ట్ సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఎలా ద‌క్కించుకున్నార‌నే అంశాల వ‌ర‌కు `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`లో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేసి దానికి సంబంధించిన ప‌నులు పూర్తి చేసే లోపు స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి సినిమాను ఓ వారం పాటు వాయిదా వేశార‌ని.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article