అప్‌డేట్ అప్‌డేట్ అప్‌డేట్… ఎన్టీఆర్ సినిమా గురించి అభిమానులు ఈమధ్య తరచూ కోరేది ఇదే. దీని గురించి ఏం చెప్పాలోఅర్థం కాక… ఆమధ్య ఓ వేడుకలోనూ ఎన్టీఆర్ కాస్త నిష్టూరంగా మాట్లాడాడు. అప్‌డేట్ తెలిస్తే మొదట ఇంట్లో భార్య కంటే ముందు మీకే చెబుతా అన్నాడాయన. నిన్న దాస్ కా ధమ్కీ వేడుకలోనూ అప్‌డేట్ ప్రస్తావన వచ్చింది. ఆయన ఈసారి మరింత గమ్మత్తుగా ఆన్సర్ ఇచ్చాడు. నేను నెక్ట్స్ సినిమా చేయడం లేదు కదా అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మళ్లీ నవ్వుతూ `త్వరలోనే అప్‌డేట్` అని చెప్పాడు. ఆ మాట చెప్పాడో లేదో… ఈ రోజు అప్‌డేట్ వచ్చింది.
ఎన్టీఆర్ – కొరటాల కలయికలో రూపొందుతున్నసినిమా ప్రారంభానికి కొత్త ముహూర్తం సెట్ అయ్యింది. ఈ నెల 23న సినిమా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించాయి సినీ వర్గాలు. ఇదివరకే ఈ సినిమా
ప్రారంభం కావల్సింది. కానీ ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో ముహూర్తం వాయిదా పడింది. ఎట్టకేలకి కొత్త ముహూర్తం ఖరారు చేశారు.మరో ఐదు రోజుల్లో సినిమా ప్రారంభం అవుతుందన్నమాట. రెగ్యులర్ చిత్రీకరణ వచ్చే నెల షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. విలన్‌గా సైఫ్ అలీఖాన్ దాదాపుగా ఖాయమైనట్టే.