ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.ఆ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది.`ఆర్.ఆర్.ఆర్` పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఆ సినిమాకోసం రంగంలోకి దిగుతాడని అంతా అనుకున్నారు.కానీ కొరటాల శివ ఆలస్యంగా కథని సిద్ధం చేయడం, తీరా ఆ కథని వినిపించాక అది సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ మార్పులు చేర్పుల కోసం సమయం తీసుకోవడం.ఇలా దాదాపుగా ఏడాది గ్యాప్ వచ్చింది తారక్‌కి.మరోవైపు అభిమానులేమో ఎప్పుడెప్పుడా అని ఆత్రతుగా ఎదురు చూస్తున్నారు.ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చేయండంటూ పోరు పెడుతున్నారు. అది గమనించిన తారక్`అప్‌డేట్ మొదట ఇంట్లో పెళ్లాం కంటే ముందు మీకే చెబుతా` అంటూ ఇటీవల స్వయంగా `అమిగోస్` ఫంక్షన్‌లో చెప్పిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకి ఈ నెల 24న సినిమాని ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆ మేరకు అన్నపూర్ణలో ఏర్పాట్లు కూడా జరుగుతుండగానే, తారకరత్న మరణించడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఇలాంటి తరుణంలో తన కొత్త సినిమాని ప్రారంభించడం ఇష్టం లేక ఎన్టీఆర్ తన సినిమాని వాయిదా వేశాడు.వచ్చే నెలలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.రెగ్యులర్ చిత్రీకరణ కూడా వచ్చే నెలలోనే మొదలు కానుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వి కపూర్ పక్కా అయ్యింది.
ReplyForward
|