ఈసారికి చేశావ్ చేశావ్… చేసిన ఈ సినిమాతో హిట్టు కొట్టి ఇక దర్శకత్వం ఆపేయ్ అంటూ సలహా ఇచ్చారు ఎన్టీఆర్.ఆయన ముఖ్య అతిథిగా దాస్ కా ధమ్కీ ముందస్తు విడుదల వేడుకకి హాజరైన సంగతి తెలిసిందే.విష్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. ఉగాది సందర్భంగా ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. విష్వక్ స్పెషల్ రిక్వెస్ట్ మేరకు ఈ సినిమా వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈ సందర్భంగా విష్వక్ నటనని… దర్శకత్వంలో ఆయనకున్న ప్రతిభని మెచ్చుకుంటూనే ఇకపై దర్శకత్వం జోలికి వెళ్లొద్దని చెప్పాడు.
ఆయన సూచన విని తప్పకుండా అంటూ తలూపాడు విష్వక్.ఇంతకీ యంగ్ టైగర్ ఎన్టీర్ విష్వక్‌ని దర్శకత్వం ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? దర్శకులు కావాలని కలలు గంటున్న యువతరానికి అవకాశాలు దక్కాలని కోరుతూ ఆయన ఈ సలహా ఇచ్చారు. “తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా అవకాశాలు సొంతం చేసుకునేందుకు ఎదురు చూస్తున్న యువ ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నారు.వాళ్లకి కూడా మనం అవకాశం ఇవ్వాలి. నటులుగా మనందరం ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించాలి. అందుకే ఈ సినిమా తర్వాత ఇక దర్శకత్వం చేయొద్దు అని విష్వక్‌ని కోరుతున్నా“ అన్నాడు ఎన్టీఆర్.