ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్

33
JR NTR WITH TRIVIKRAM
JR NTR WITH TRIVIKRAM

ntr, trivikram movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండో సినిమా వస్తుంది అని గతంలోనే ప్రకటించారు. హారిక హాసిన బ్యానర్ లో రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. అందుకు కారణం త్రివిక్రమే అనేది లేటెస్ట్ న్యూస్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేత వీరరాఘవ అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు. భారీ అంచనాలు కూడా ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఇబ్బందిగా ఫీలయ్యారు. దీంతో ఈ సారి ఆ విషయం మరిపించేలా ఓ అద్భుతమైన పొలిటికల్ ఎంటర్టైనర్ తో వస్తున్నారని హింట్స్ ఇచ్చారు. కానీ కరోనా వల్ల ఎన్టీఆర్ రాజమౌళి సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ సినిమా సైతం ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఇక ఎన్టీఆర్ తో పెట్టుకుంటే అయ్యేలా లేదని అతనితో సినిమాను వదులుకున్నాడని అనఫీషియల్ గా ఇప్పుడు వినిపిస్తోన్నా.. రేపో మాపో అఫీషియల్ గానే చెప్పబోతున్నారు. మామూలుగా ఎన్టీఆర్ – రాజమౌళి సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని అందరికీ తెలుసు. ఇప్పటికే త్రివిక్రమ్ గత సంక్రాంతి నుంచి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మధ్యలో కరోనా కాలం తీసేసినా.. ఇంకా అంతకంటే ఎక్కువ సమయం ఎన్టీఆర్ కోసం ఆగాల్సి ఉంటుంది. మరోవైపు ఏవైనా గెటప్పులు ఉంటే.. అందుకోసం మరింత టైమ్.

ఇవన్నీ ఆలోచించుకునే త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారువారి పాట చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరులా అత్యంత తక్కువ టైమ్ లోనే పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని వచ్చే జనవరిలోనే సర్కారువారి పాటతో పాటే త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా కూడా స్టార్ట్ అవుతుందట. ఇక ఈ మొత్తం వ్యవహారానికి ఖలేజా సినిమాకు సంబంధించి మహేష్ చేసిన ట్వీట్ కారణం అనుకుంటారేమో.. అది నిజమే అయినా.. ఇటు నిర్మాణ సంస్థ నుంచి కూడా ఇప్పటికే ఫీలర్స్ వచ్చాయి. ఇక మిగిలింది అఫీషియల్ ప్రకటనే. ఏదేమైనా త్రివిక్రమ్ కు దర్శకుడుగా పెద్దగా రేంజ్ లేని టైమ్ లో మహేష్ తో అతడు చేశాడు. తర్వాత అంచనాలతో వచ్చిన ఖలేజా వాటిని అందుకోకపోయినా మహేష్ కు స్పెషల్ మూవీగా నిలిచింది. మరి ఈ సారి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here