ఊబ‌కాయాన్ని క‌ట్ట‌డి చేద్దామిలా..

239
Obesity Control Tips 
Obesity Control Tips 
డాక్టర్. కృష్ణ.విపి.
డాక్టర్. కృష్ణ.విపి. 
కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం.

Obesity Control Tips

ప్రపంచమంత ఊబకాయం యొక్క గుప్పిట్లో ఉంది. ప్రపంచంలో మరియు భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతన్నారు. ఇది పెద్దవారిలో ఉన్న సమస్య మాత్రమే కాదు. అన్ని వయసుల వారు ఈ ఊబకాయనికి ప్రభావితమవుతున్నారు. ఈ ప్రపంచ ఊబకాయ దినోత్సవం పురస్కరించుకొని… ఊబకాయానికి గల కారకాలు మరియు ఉబకాయం నుండి బయటపడటానికి ఎలాంటి పద్దతులు పాటించాలో తెలుసుకుందాం.

ఊబకాయం అనేది శరీరంలో అతిగా పేరుకపోయిన కొవ్వు. ఇది పశ్చిమ దేశాల్లో ? 30 కిలోలు / ఎం2 ఆసియాలో 25కిలోలు/ ఎం2 BMI. ఊబకాయం శరీరంలోని అధిక కొవ్వు మరియు డైమోర్ఫిజానికి మాత్రమే పరిమితం కాదు. ఇది రక్తపోటు, డయాబెటిస్ మెల్లిటస్, హార్ట్ ఎటాక్స్, హెపటైటిస్, మోకాలి కీళ్ల నొప్పులు, రొమ్ము, కడుపు మరియు కాలేయానికి సంబంధించిన క్యాన్సర్ల ప్రమాదం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నిరాశ మరియు సామాజిక ఇబ్బందులకు కూడా గురిచేస్తుంది.

  • ఊబకాయం అనేది ఎల్లప్పుడూ అధిక కేలరీల తీసుకోవడం వల్ల కలగదు. హైపోథైరాయిడిజం, స్టెరాయిడ్ అసాధారణత, పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్, జన్యు వ్యాధులు మరియు వ్యాయామం లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ఊబకాయాన్ని తగ్గించాలంటే ఆహార నియంత్రణ మరియు నిత్య వ్యాయమం చాలా ముఖ్యమైనది. 1 కిలో బరువు తగ్గాలంటే 7000 కిలో కేలరీలు తగ్గించాలి. ఛీస్‌, జున్ను, ఎక్కువగా ఫ్రై చేసిన వంటి ఆహారాలను తీసుకోకుడదు. కూరగాయలు మరియు పండ్ల వంటి డైటరీ ఫైబర్ పదర్థాలను ఎక్కువగా తీసుకోవాలి. సరైన ఆహార నియమాన్ని పాటిస్తే ఊబకాయాన్ని తగ్గించవచ్చు.
  • ఊబకాయం నిర్వహణలో రెండవ భాగం వ్యాయామం. వారానికి 150 నుండి 300 నిమిషాల చురుకైన నడక, ఏరోబిక్ వ్యాయామాలు బరువును తగ్గించటంలోనే కాకుండా గుండె స‌మ‌స్య‌లు తగ్గించడంలో కూడా సహాయపడతాయని సిఫార్సు చేయబడింది. వ్యాయామంలో సమస్య ఏమిటంటే, ఊబకాయం ఉన్నవారికి మోకాలి కీలు నొప్పి ఉంటుంది, ఇది వ్యాయామం చేయడంలో వారికి ఇబ్బంది కలగవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ఈత ఉత్తమ ప్రత్యామ్నాయం.
  • అతి తీవ్ర‌మైన ఊబ‌కాయ‌స్థుల్లో (BMI 35-40kg / m2) ఉన్న రోగులకు బెలూన్ను కడుపులో ఉంచడం ద్వారా లేదా శస్త్రచికిత్స ద్వారా గ్యాస్ట్రిక్ సామర్థ్యాన్ని తగ్గించడం, కడుపు సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గింపును సాధించవచ్చు. ఇలాంటి ప్ర‌క్రియ ద్వారా డైయబెటిస్‌ని మందులు లేకుండా త‌గ్గిన సాక్ష్యాలు ఉన్నాయి. మ‌న‌మంత స‌రైన ఆహార అల‌వాట్లు మ‌రియు వ్యాయ‌మంతో ఊబ‌కాయం అనే మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌వచ్చు.

Obesity Control Tips

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here