ఒడిశా ముఖ్యమంత్రి సంచలనం

ODISSA Chief Minister Sensational News… ఎన్నికల్లో మహిళలకు ౩౩ శాతం సీట్లు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బీజూ జనతా దళ్ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. ఆదివారం (మార్చి 10)న మహిళా స్వయం సహాయ బృందం (ఎస్‌హెచ్‌జీ) సమావేశంలో పాల్గొన్న పట్నాయక్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. నవీన్ నిర్ణయంపై పార్టీ కార్యకర్తలతో పాటూ మహిళా సంఘాల నుంచి ఆనందం వ్యక్తం చేశారు.

మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడి.. ఆ దిశగా అడుగులు వేయాలంటున్నారు పట్నాయక్. మన దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలన్నా.. ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నా మహిళా సాధికారతే ముఖ్యమన్నారు. దేశంలో మహిళా సాధికార సాధించేందుకు ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారని అభిప్రాయపడ్డారు. మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ పట్నాయక్ గతేడాది ఒడిశా అసెంబ్లీలో ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదించారు . ఇప్పుడు 33శాతం సీట్లు మహిళలకు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.

 

Latest political news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article