శభాష్ తెలంగాణ ఆఫీసర్స్

128
Officers Visit Containment Zones 
Officers Visit Containment Zones 

Officers Visit Containment Zones

కరోనా వైరస్ నివారణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ ప్రభావిత ప్రాంతాలలో కంటేన్ మెంట్ జోన్ లను ఏర్పాటు చేసి పక్బంది చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.నగరంలో ని మలక్ పేట కంటేన్ మెంట్ జోన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తో కలిసి శుక్రవారం పర్యటించి కంటేన్ మెంట్ జోన్ లో చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోన్ లో 750 ఇళ్లు ఉండగా వారందరితో ఒక వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారికి అవసరమైన నిత్యవసర వస్తువులను ఇంటి వద్దే అందించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జోన్ లో ఒకే కుంటుంబానికి చెందిన 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు, కరోనా నెగటివ్ వచ్చిన మరికొంతమంది స్థానిక మసీదులో క్వారంటైన్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ జోన్ లో గట్టిగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఎన్ ట్రీ , ఎగ్జ్సి ట్ నిషేదించడం వలన పరిస్ధితి అదుపులో ఉందని అన్నారు.

పోలీస్ , వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో కూడిన నోడల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్య అధికారులు ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 14 రోజుల వరకు ఏదైన జోన్ లో ఒక్క పాజిటివ్ కేసు రాకపోతె కంటేన్ మెంట్ తోలగించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నగరంలో ఒక్క పాజిటివ్ కేసు రాని 16 చోట్ల కంటేన్ మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజప్రతినిధుల సహకారం, ప్రభుత్వ అధికారుల కృషితో పకడ్బంది ఏర్పాట్లు చేయ్యడం ద్వారా కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఇండ్లలోనే ఉండి కరోనా నియంత్రణకు పూర్తిగా సహాయసహకారాలను అందించాలని కోరారు.

Telangana Covid-19 Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here