825.2 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నిక‌ర లాభం

825.2 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నిక‌ర లాభం

640.4 శాతం పెరిగిన రెవెన్యూ

ఈ త్రైమాసికంలో 169 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల డెలివ‌రీ

హైదరాబాద్, జూలై 28:దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ స్టాండ్అలోన్ ప్రాతిపదికన, జూన్ 30, 2022తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.304.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది జూన్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో సాధించిన‌ రూ.41.2 కోట్ల‌ ఆదాయంతో పోల్చితే ఇది 640.4 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ప్రధానంగా 169 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయ‌డంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించింది. గ‌త ఏడాది తొలి త్రైమాసికంలో కేవలం 11 బస్సులను మాత్రమే డెలివ‌రి చేయ‌గ‌లిగింది. పూణేలో బస్సుల నిర్వ‌హ‌ణ ద్వారా కూడా ప్రస్తుత త్రైమాసికంలో అధిక ఆదాయం నమోదైంది. ఈ ఏడాది పన్ను తర్వాత లాభం 18.8 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం తొలి త్రైమాసికంతో ఆర్జించిన రూ. 2.0 కోట్లతో పోల్చితే ఇది 825.2 శాతం అధికం. EBITDA 8.7 కోట్ల నుండి 322.6 శాతం పెరిగి రూ.36.8 కోట్లకు చేరుకుంది. పన్నుకు ముందు లాభం (PBT) 799.9 శాతం పెరిగి రూ. 24.7 కోట్లుగా న‌మోదు అయింది.
Q-o-Q ప్రాతిపదికన, ఆదాయం రూ.268.1 కోట్ల నుండి రూ.304.7 కోట్లకు పెరిగి, 13.6 శాతం వృద్ధి చెందింది. కాగా, కంపెనీ 7.7 శాతం వృద్ధితో రూ.18.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. EBITDA 18.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ-బస్ డివిజన్ 2022 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.279.4 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గ‌త ఏడాది తొలి త్రైమాసికం ఆదాయం రూ. 23.4 కోట్లతో పోల్చితే ఇది 1096 శాతం ఎక్కువ‌. ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా 11 బ‌స్సుల నుంచి 169 బ‌స్సుల‌కు పెరిగిన కార‌ణంగా ఈ పెరుగుద‌ల సాధ్య‌మైంది. అలాగే పూణే బస్ కార్యకలాపాల నుండి అధిక నిర్వహణ ఆదాయం న‌మోదు అయింది.

ఇన్సులేటర్ డివిజన్ ఆదాయం రూ. 17.8 కోట్ల నుంచి రూ. 25.3 కోట్లకు పెరిగింది. దీంతో రెవెన్యూ 42 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. అధిక కస్టమర్‌ల క్లియరెన్స్‌ల కారణంగా ఆదాయంలో పెరుగుద‌ల న‌మోదు అయింది.

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.వి. ప్రదీప్ మాట్లాడుతూ, “మా అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా అనుకూలమైన ఫ‌లితాలు అందివ‌చ్చాయి. గ‌త మూడు నెల‌ల కాలంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల తయారీని వేగవంతం చేయడంతో పాటు డెలివరీలు రికార్డు స్థాయి 169కి పెరిగాయి. ఈ ఊపు ను కొన‌సాగించి కొత్త పుంతలు తొక్కడానికి మరింత‌గా ప్ర‌య‌త్నిస్తాం. మేము వివిధ STUలకు డెలివరీలను పెంచడంతో పాటు డెలివరీల‌ షెడ్యూల్‌లను పూర్తి చేస్తాం. ఈ త్రైమాసిక పనితీరు నాకు మరింత బలపడాలనే విశ్వాసాన్ని ఇచ్చింది. రానున్న త్రైమాసికాల‌లో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతో పాటు మ‌రిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తాం. అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article