మరోమారు బోటు బయటకు తీసే యత్నం చేస్తున్న ధర్మాడిసత్యం టీమ్

Once again darmadisatyam  team trying to pull the boat

కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు బోటు బయటకు తియ్యలేకపోయారు. పలుమార్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇక మరోమారు బోటును  బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సన్నాహాలు చేస్తోంది.. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ను కలిసి అనుమతి కోరింది. సోమవారం నుండి బోటును తీయనున్నట్టు జిల్లా అధికారులకు సమాచారం అందించింది. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ధర్మాడి సత్యం బృందం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతిని పెరగడంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్ పడింది.అయితే ప్రస్తుతం ఎగువనుండి వస్తున్న వరద తగ్గడంతో ధర్మాడి సత్యం ఆదివారం కలెక్టర్‌ను కలిసి గోదావరి పరిస్థితి వివరించాడు. దీంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మరోసారి సత్యం బృందం ప్రయత్నాలు చేయనుంది. కాగా బోటు వెలికితీత ప్రయత్నాలు చేస్తున్న సంధర్భంలోనే బోటు ప్రమాదంలో మృతిచెందిన మరో రెండు మృతదేహాలు ధవళేశ్వరం ప్రాజెక్టు వద్దకు కొట్టుకు వచ్చాయి. సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

tags :boat mishap, kachhuluru, dharmadi sathyam team, bring out,

http://tsnews.tv/jagan-busy-in-promises-implementation/
http://tsnews.tv/kcr-more-than-nallari/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *