సమ్మె యథాతథం…కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక పోరాటం

Ongoing RTC Workers Strike

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు లేనట్టుగాతయారయింది. హైకోర్టులో కార్మికులు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తే హైకోర్టు, లేబర్ కోర్టు ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పటంతో లేబర్ కోర్ట్ లో తమ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్న సందిగ్ధత ఆర్టీసీ కార్మికులలో నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే భేటీ అయిన ఆర్టీసీ కార్మిక జెఎసి కార్మిక కోర్టు తీర్పు పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని  ప్రకటన చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే సమ్మె కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి. ఇక అదే విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు తుది కాపీ అందాక న్యాయనిపుణులతో సమావేశమవుతామని, లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్లవచ్చు అనేది చూస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు.  సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో కార్మికుల అభిప్రాయాలను సైతం తీసుకొని చర్చించారు. ఎల్బీనగర్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్, సాగర్ రింగ్ రోడ్ లో ఎంప్లాయిస్ యూనియన్ ఇలా ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ వేరు వేరు ప్రాంతాలలో ఎవరికి వారు సమావేశాలు నిర్వహించారు. ఇక అన్ని సమావేశాలలో సేకరించిన అభిప్రాయాలను ఏకాభిప్రాయంగా భావించి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు.  90% కార్మికులు సమ్మెను కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆర్టీసీ కార్మిక కుటుంబాల కోసం ప్రాణాలు వదిలిన అమరులైన ఆర్టీసీ కార్మికుల కోసమైనా సమ్మెను కొనసాగించాలని కార్మికులు చెప్పారన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సమ్మె ఉధృతంగా కొనసాగిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. లేబర్ కోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుందామని నిన్న జరిగిన కీలక భేటీ లో చర్చించారు.

tags: tsrtc strike, rtc strike, rtc workers jac, ashwatthama reddy, protest, high court verdict, labor court

ఈఎస్ఐ కుంభకోణంలో లోతుగా దర్యాప్తు

ఉద్యోగం పోతుందన్న భయంతో ఆత్మహత్య

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article