ఆన్ లైన్ ఆడిట్.. తెలంగాణలో 100 శాతం పూర్తి

85
Online audit 100 percent complete in Telangana
Online audit 100 percent complete in Telangana
  • రెండో స్థానంలో ఆంద్రప్రదేశ్
  • మూడో స్థానంలో తమిళనాడు

హైదరాబాద్: తెలంగాణలోని 12769 గ్రామపంచాయితీల ఆడిట్ను రాష్ట్ర ఆడిట్ శాఖ 100 శాతం ఆన్ లైన్ లో పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ అమలు చేస్తున్న నూతన ఆన్ లైన్ ఆడిట్ విధానములో భాగంగా 30 రాష్ట్రాలలో 13 శాతం మాత్రమే ఆడిట్ పూర్తి కాగా, తెలంగాణ లో రాష్ట్ర ఆడిట్ శాఖ 100 శాతం పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 30 రాష్ట్రాలలో 2,56,561 గ్రామ పంచాయితీ లకు గానూ 32,820 గ్రామ పంచాయితీ లలో ఆన్ లైన్ ఆడిట్ పూర్తి కాగా తెలంగాణ లోని 12,769 గ్రామపంచాయితి లకు గాను 12,769 గ్రామపంచాయితి ఆడిట్లను పూర్తి చేసి ఆడిట్ నివేదికలను ఆన్ లైన్ లో పొందు పర్చడమైనది. రెండో స్థానంలో ఆంద్రప్రదేశ్ లో 6,549 గ్రామ పంచాయితిలలో ఆన్ లైన్ ఆడిట్ పూర్తి చేసింది. తమిళనాడు లో 5,560 , రాజస్థాన్ లో 1,890 ,హిమాచల్ ప్రదేశ్ లో 645 , ఒరిస్సా లో 2,657, కర్ణాటక లో 1130 , ఉత్తర ప్రదేశ్ లో 603 గ్రామ పంచాయితిలలో ఆన్ లైన్ ఆడిట్ చేశారు. ఇంకా ఆన్ లైన్ ఆడిట్ ను 16 రాష్ట్రాలు ప్రారంబించలేదు. అలాగే దేశవ్యాప్తం గా 6703 మండల పరిషత్ లు ఉండగా, తెలంగాణ లో 540 మండలకు గానూ 156 మండలాలు పూర్తి చేసుకుని మొదట నిలిచింది , అలాగే ఆంద్రప్రదేశ్ లో 9 మండలాలు , ఒరిస్సా 18 మండల పరిషత్ లు పూర్తి అయ్యాయి . మండల పరిషత్ ఆడిట్ లు కేవలం తెలంగాణ , ఆంద్రప్రదేశ్ , ఒరిస్సా లు మాత్రమే ప్రారంభించాయి. కేంద్రం ఆన్ లైన్ ఆడిట్ నిర్ధెశించగా ఆర్ధిక మంత్రి హరీష్ రావు గారి నిరంతర పర్యవేక్షణలో, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర0లో ఆన్ లైన్ ఆడిట్ ని జూన్ మాసం నుంచి ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వర రావు యాక్షన్ ప్లాన్ తయారు చేయించి అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఆడిట్ శాఖ ముందుంది. వంద శాతం ఆన్ లైన్ లో గ్రామపంచాయితీల ఆడిట్ చేసేలా కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ చర్యలు తీసుకున్నా పలురాష్ట్రాలు పాటించని పరిస్థితి. తెలంగాణ ఆడిట్ శాఖ ఇప్పటికే ఆన్ లైన్ ఆడిట్ లో 2,10,781 అభ్యంతరాలను నమోదు చేశారు. దేశంలో 14 రాష్ట్రాలు మాత్రమే ఆన్ లైన్ ఆడిట్ ని ప్రారంభించాయి. మిగిలిన 16 రాష్ట్రాలు ఇంకా ఆన్ లైన్ ఆడిట్ విధానాన్ని అమలు చేయలేకపోతున్నాయి . తెలంగాణ లో కరొన వాక్సిన్ ని ప్రజలకు వేయించే పనిలో పంచాయితీ సిబ్బంది ఉన్నా, ఆడిట్ లు 100 శాతం పూర్తి చెయగలిగారు. రాష్ట్ర ఆడిట్ ఉద్యోగులు గత ఐదు నెలలు గా పంచాయితీ ఆడిట్ లలో నిమగ్నమై పూర్తి చేశారు .

ఆన్ లైన్ లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఆడిట్ లు: డైరెక్టర్
నిరంతర పర్యవేక్షణ తో నే 100 శాతం ఆడిట్ ఆన్ లైన్ పూర్తిచేసుకోగలిగామని , ఆడిటర్ ల కృషి తోనే ఇది సాద్యం అయిందని ఆడిట్ శాఖ తెలంగాణ డైరెక్టర్ వేంకటేశ్వర రావు తెలిపారు.అన్నీ జిల్లాల ఆడిట్ అధికారుల తో ఈ రోజు వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ అడిట్ విదానాన్ని తమ రాష్ట్రాలలో అమలు చేయుటకు చర్యలు తెసుకుంటున్నారని తెలిపారు . మిగిలిన మండల పరిషత్ ఆడిట్ లు సైతం ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరకు 540 మండల పరిషత్ లకు గానూ 156 అయ్యాయి మిగిలవి కూడా పూర్తి చేయాలని ఆదేశించారు . తెలంగాణ ఆన్ లైన్ ఆడిట్ విధానం ఇతర రాష్ట్రాలకు మార్గధర్శకంగా ఉందని తెలిపారు. జిల్లా పరిషత్ ఆడిట్ లు చేసి నివేదికలను ఆన్ లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఈ సంధర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడిటర్ లను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here