Saturday, October 5, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్‌తో అప్పుల‌పాలు

రైతు కుటుంబం ఆత్మహత్య

ఆన్‌లైన్ బెట్టింగ్.. ఓ రైతు కుటుంబాన్ని నిండా ముంచింది. చివ‌ర‌కు పొలం అమ్ముకోవాల్సి వ‌చ్చింది. అప్పుల‌పాలై ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఎడ‌ప‌ల్లి మండ‌లం వ‌డ్డేప‌ల్లికి చెందిన హ‌రీశ్.. రైతు కుటుంబానికి చెందిన వ్య‌క్తి. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అల‌వాటు ప‌డ్డ హ‌రీశ్‌.. దాదాపు రూ. 20 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు.

దీంతో కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేయాల్సి వ‌చ్చింది. అప్పులు కూడా అధికం అవ‌డంతో.. ఉన్న పొలాన్ని కూడా అమ్మేశాడు. అయిన‌ప్ప‌టికీ ఆర్థిక ఇబ్బందులు హ‌రీశ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన హ‌రీశ్‌.. త‌న త‌ల్లిదండ్రుల‌కు ఉరేసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల్లిదండ్రుల‌ను సురేశ్‌, హేమ‌ల‌త‌గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప్ట‌టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular