కారెక్కనున్న కేసీఆర్ ప్రత్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడి

Onteru Pratap Reddy .. కాంగ్రెస్ కి షాకే

తెలంగాణా కాంగ్రెస్ కు మరో ఊహించని షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్ తో తలపడి తనను ప్రచారం చెయ్య నివ్వడం లేదంటూ నానా హంగామా చేసిన కెసిఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుంది.
తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ చేతిలో ఓటమిపాలై ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ ఊహించని పరిణామం అటు కాంగ్రెస్ పార్టీకే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలను షాక్కు గురి చేస్తుంది. ఎన్నికల సమయంలో కెసిఆర్ కి ఎదురు నిలబడి ఆయన పైన విమర్శల దాడి చేసిన నేతను కేసీఆర్ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు. ఇక నిన్నటివరకు తిట్టిన నాయకుడి చెంతకు ప్రతాప్ రెడ్డి ఎలా చేరుతున్నారు అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చకు కారణమవుతుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.2009 ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ఈ స్థానం నుండి మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
గత ఏడాది క్రితం ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ప్రతాప్ రెడ్డిని టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ ఆహ్వానించారు. కానీ, ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరలేదు. టీడీపీలోనే కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే ముందు కూడ ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని మరోసారి ఆహ్వానించినా కూడ ప్రతాప్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో తన అనుచరులతో ప్రతాప్ రెడ్డి భేటీ అయ్యారు. టీఆర్ఎస్‌లో చేరిక విషయమై ప్రతాప్ రెడ్డి చర్చిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా వంటేరు ప్రతాపరెడ్డి టిఆర్ఎస్ లో చేరటం నిజంగా సంచలనమే. కారణాలేవైనా ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article