కాంగ్రెస్ లో చేరనున్న ఊర్మిళ?

191
OORMILA MAY JOIN CONG?
OORMILA MAY JOIN CONG?

OORMILA MAY JOIN CONG?

  • ముంబై నార్త్ నుంచి బరిలోకి దిగే అవకాశం

రంగీలా హీరోయిన్ ఊర్మిళ గుర్తుందా? యాయిరే యాయిరే వార్రెవా ఇది ఏం జోరే.. అంటూ అప్పట్లో కుర్రకారును ఉర్రూతలెక్కించిన ఈ భామ త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఈ లోక్ సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఊర్మిళ బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ ఎంపీ గోపాల్‌ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఊర్మిళను అక్కడ బరిలోకి దింపితే బాగుంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై అటు ఊర్మిళ నుంచి గానీ.. ఇటు కాంగ్రెస్‌ నేతల నుంచి గానీ అధికారిక సమాచారం లేదు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఊర్మిళ తెలుగువారికి కూడా తెలిసిన వ్యక్తే. రంగీలాతోపాటు అంతం, అనగనగా ఒక రోజు, గాయం వంటి చిత్రాల్లో నటించారు.

NATIONAL NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here