బిజెపి కుట్రలను వ్యతిరేకించండి

విశాఖ:స్టీల్ ప్లాంట్ బలహీనపరిచే విధంగా పూర్తిస్థాయి ఉత్పత్తులను చేయకుండా బిజెపి చేస్తున్న కుయుక్తులను కుట్ర లను వ్యతిరేకించండని సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు పిలుపునిచ్చారు నేడు సిపిఎం స్టీల్ డివిజన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు దీనిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యాజమాన్యాల విధానాలకు వ్యతిరేకంగా నినదించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం కార్పొరేటర్ డా.బి.గంగారావు మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఉత్పత్తులపై ఆంక్షలతో దీనిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు దీనికి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గడచిన 510 రోజులుగా చేస్తున్న ఉద్యమంపై ప్రజా మద్దతును తగ్గించాలన్న కుట్రలో భాగంగానే నేడు కోకో ఓవెన్ బ్యాటరీ 1&2 ప్రైవేటీ కరణకు శ్రీకారం చుట్టారని ఆయన వివరించారు తక్షణం ప్లాంటును బలహీనపరిచే చర్యలను ఆపాలి అలాగే పూర్తి సామర్థ్యంతో నడపాలి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ రామా రావు మాట్లాడుతూ ప్రభుత్వ చర్య లను సమర్థిస్తున్న స్టీల్ యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు ప్లాంట్ లో విభాగాల వారీగా ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతున్నారని అందులో భాగమే కోకో ఓవెన్ బ్యాటరీ 1&2 మరమ్మత్తులకై టెండర్లు పిలిచారని ఆయన వివరించారు అలాగే బ్లాస్ట్ ఫర్నిస్ 3,2 ఉత్పత్తులు నిలుపుదల చేసి ఎస్ఎమ్ఎస్ హిట్ల సంఖ్య తగ్గించ డం ద్వారా మిల్స్ ఉత్పత్తులపై ప్రభావం పడి తద్వారా నష్టాలు వచ్చాయని చూపి ప్రైవేటు వారికి కారు చౌకగా కట్టబెట్టాలనే కుట్ర దీనిలో దాగుందని ఆయన వివరించారు. కనుక దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మరింత అప్రమత్తంతో ఉద్యమిం చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసరాజు,సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు వై టి దాస్,యు రామస్వామి,కె యమ్ శ్రీనివాస్,బి అప్పారావు,టివి కె రాజు, నమ్మి రమణ,జి శ్రీనివాస్,వివి రమణ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article