ఓటీటీలో ఓరేయ్ బుజ్జిగా…

35
Orey Bujjiga In OTT
Orey Bujjiga In OTT

Orey Bujjiga In OTT

రాజ్‌ తరుణ్ హీరోగా నటించిన మూవీ ‘ఓరేయ్‌ బుజ్జిగా’. హీరో సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటించగా, హెబ్బాపటేల్‌ స్పెషల్ రోల్ లో కనిపించనుంది. సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘అక్కడ మా బావ, ఇక్కడ వీడు’ అంటూ మాళవిక చెప్పే డైలాగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి, నరేష్, సప్తగిరి, అజయ్‌ ఘోష్, రాజా రవీంద్ర నటించిన ఈ సినిమా మళ్లీ రాజ్ తరుణ్ కు హిట్ ఇచ్చేలా కనిపిస్తోంది.

ఈ సినిమాకు గుండెజారి గల్లంతయిందే ఫేం విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించగా, కేకే రాధామోహన్‌ సినిమాని నిర్మించారు. అనుబ్ రూబెన్స్ సంగీతం. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. ఆరోజు ‘ఆహా’లో ప్రేక్షకులను అలరించనుంది. చిన్న, పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో విడుదల కానుండటంతో అమెజాన్ ప్రైమ్, ఆహాకు సబ్ స్రైబర్స్ భారీగా పెరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here