ఓయూ సూపర్ గ్రీన్

39
Osmania Univ Super Green
Osmania Univ Super Green

OU Super Green

ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలు పచ్చదనంతో కనులకు ఇంపుగా కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ వ్యాఖ్యానించారు. మంగళవారం మధ్యాహ్నం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్​ కమిషనర్​, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్​ చార్జి వైస్​ ఛాన్సలర్​ అర్వింద్​ కుమార్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​ కుమార్​ లతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలను దాదాపు గంట పాటు సీఎస్​ కలియతిరిగారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు లోబడి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు చీఫ్​ సెక్రెటరీ సోమేశ్​ కుమార్​ మార్గదర్శకంలో ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమంలో భాగంగా ఇన్​ చార్జి వీసీ అరవింద్ కుమార్​ ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిస్థాయిలో ‘గ్రీన్​ వర్సిటీ’గా తీర్చిదిద్దేందుకు నడుంబిగించారు. ఓయూ గ్రీనరీ బాధ్యతలను హెచ్​ఎండిఏ అర్బన్​ ఫారెస్ట్రీ విభాగానికి అప్పగించి నిరంతరం పర్యవేక్షిస్తూ ఓయూ పరిసరాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు.

రెండు దశాబ్దాల తర్వాత ఓయూ పరిసరాల్లో అతి తక్కువ కాలంలో గొప్ప మార్పులు చోటుచేసుకోవడం సంతోషకరమని, వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని గత ఐదు నెలల కాలంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 12లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ)ను సీఎస్ సోమేశ్​ కుమార్​​ అభినందించారు.

హైదరాబాద్​ జంటనగనరాలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో విరివిగా నాటిన మొక్కలు నూటికి నూరు శాతం పెరిగి ప్రజానీకానికి అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత హెచ్ఎండిఏ, జీహెచ్​ఎంసి యంత్రాంగంపైనే ఉందని సీఎస్​ సోమేశ్​ కుమార్​ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిధిలో తొమ్మిది (9) చోట్ల యాదాద్రి మోడల్ ​(మియావాకి పద్దతి) లో దాదాపు మూడు(3)లక్షల మొక్కలు, మిగతా ఖాళీ స్థలాల్లో తొమ్మిది(9)లక్షల మొక్కలు ఎదుగుతున్నట్లు చీఫ్​ సెక్రెటరీ సోమేశ్​ కుమార్​ కు వర్సిటీ ఇన్​ చార్జి విసీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్​ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ వివరించారు. సహజసిద్దమైన ప్రకృతి ఒనరులు కలిగిన ఉస్మానియా వర్సిటీకి పూర్వవైభవం తీసుకువచ్చే లక్ష్యంతో కుందేళ్లు, నెమళ్లు ఇతర ఆటవీ పక్షులు అలారారే విధంగా పూలు, పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టామని, మర్రి, ఉసిరి, సీతాఫలం, దానిమ్మ, అల్లనేరేడు, కానుక, వేప వంటి మొక్కలను నాటినట్లు చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్​లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్కలు టెకోమా గాడిచౌడి(ఎల్లో కలర్​), రెండు మూడు రకాలకు చెందిన సిజల్​ పినియా, నెమలి నారా, గుల్​ మోహర్​, క్యాథోడియా వంటి పూల మొక్కలు ఉన్నట్లు సీఎస్​కు ఆయన వివరించారు.

ఉస్మానియా ఇన్​ చార్జి విసిగా అర్వింద్​ కుమార్​ కాలంలోనే యూనివర్సిటీలో పరిసరాలతో పాటు పరిపాలన పరంగా గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయని ఓయు రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​ సీహెచ్​.గోపాల్​రెడ్డి సీఎస్​ సోమేశ్​ కుమార్​కు తెలిపారు. ఓయూ పరిధిలో ఉన్న మోహిని కుంట చెరువు ప్రస్తుతం సందర్శకులకు కేంద్రంగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా వైస్​ ఛాన్సలర్​ బంగ్లా గార్డెన్​ లో చీఫ్​ సెక్రెటరీ సోమేశ్​ కుమార్​ మర్రి మొక్కను, ఇన్​ చార్జి విసి అర్వింద్​ కుమార్​ పొగడ మొక్కను, జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​ కుమార్​ కదంబ మొక్కను నాటారు. కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్​ ఫారెస్ట్రీ ఇన్​ చార్జి డైరెక్టర్​ ప్రకాశ్​, ఆర్ట్స్​ కాలేజీ ప్రిన్సిపాల్​ ప్రొఫెసర్​ డి.రవీందర్​, ఓయూ డైరెక్టర్​ గ్రీన్​ బెల్ట్​ డాక్టర్​ చంద్రు, విసి ఓఎస్డీ ప్రొఫెసర్​ టి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Telangana CS Somesh Kumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here