అందుబాటులో ఆస్టియోపొరోసిస్ ప్యాకేజి

52

అందుబాటులో ఆస్టియోపొరోసిస్ ప్యాకేజిని ప్రారంభించిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి

హైద‌రాబాద్, నవంబ‌ర్ 23, 2021: న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ల‌క్డీకాపుల్‌)లో కేవ‌లం రూ.999/-కే అందుబాటులో ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ ప్యాకేజిని ప్రారంభిస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. దీనివ‌ల్ల మ‌రింత‌మంది త‌మ‌కున్న స‌మస్య‌ల‌కు ప‌రీక్ష చేయించుకునే అవ‌కాశం ఉంది. ఈ ప్యాకేజి 2021 న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.

ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ ప్యాకేజిలో భాగంగా సీరం కాల్షియం, సీరం ఫాస్ఫ‌ర‌స్, సీరం మెగ్నీషియం, సీరం విట‌మిన్ డి3 (ఇవ‌న్నీ ర‌క్త‌ప‌రీక్ష‌ల ద్వారా నిర్ధారిస్తారు), వీటితోపాటు ఒక సింగిల్ వ్యూ ఎక్స్‌-రే (ఎల్ఎస్ స్పైన్ లేట‌ర‌ల్‌), ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌, డాక్ట‌ర్ సాకేత్‌ల‌తో క‌న్స‌ల్టేష‌న్ ఉంటాయి.

ఈ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం గురించి గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ల‌క్డీకాపుల్‌) సీఈవో గౌర‌వ్ ఖ‌న్నా మాట్లాడుతూ, “వ‌య‌సు మీద‌ప‌డే కొద్దీ కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఎముక‌లు బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల ఇవి వ‌స్తాయి. ఇది క్ర‌మంగా కీళ్ల నొప్పిగా మారుతుంది. కానీ, కొంద‌రిలో వృద్ధాప్యం రాక‌ముందే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తుతుంది. ముందుగానే ప‌రీక్ష‌లు చేయించుకుంటే వీటిని అరిక‌ట్ట‌వ‌చ్చు. అందుకు ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి. ఈ స‌మ‌స్య గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ప‌రిస్థితి చేయిదాట‌క‌ముందే స‌రైన నివార‌ణ స‌ల‌హాలు ఇవ్వాల‌ని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి విశ్వ‌సిస్తోంది” అని చెప్పారు.

“ఉప్పు, కెఫిన్, మ‌ద్యం, ఎర్ర‌మాంసం, సోడాలు.. ఇలాంటివాటిని వీలైనంత త‌క్కువగా తీసుకోవాలి, లేదాపూర్తిగా మానేయాలి. అప్పుడే ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. బోర్లా ప‌డుకోవ‌డం మానేయాలి, దానికి బ‌దులు ఒక‌వైపు తిరిగి, లేదా వెల్ల‌కిలా ప‌డుకుంటే వెన్నెముక తిన్న‌గా ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల, చురుకైన జీవ‌న‌శైలి పాటిస్తే ఆస్టియోపోరోసిస్ నుంచి చాలావ‌ర‌కు బ‌య‌ట‌ప‌డొచ్చు. ఎముక‌లు, కండ‌రాల బ‌లానికి ఫిజియోథెర‌పీ చేయించుకోవ‌డం వ‌ల్ల కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ల‌క్డీకాపుల్‌లోని గ్లెనీగ‌ల్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో చాలామంచి ఫిజియోథెర‌పీ విభాగం ఉంది” అని గ్లెనీగ‌ల్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కె.సాకేత్ వివ‌రించారు.

గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి గురించి:
హైద‌రాబాద్ ల‌క్డీకాపుల్ ప్రాంతంలోని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి భార‌త‌దేశంలోని టెర్షియ‌రీ కేర్ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ‌మైన‌ది. గ‌డిచిన 20 ఏళ్లుగా అవ‌వ‌య మార్పిడి విష‌యంలో మ‌ధ్య, తూర్పు భార‌త‌దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆసుప‌త్రికి ఎన్ఏబీఎల్‌, ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉంది. 150 ప‌డ‌క‌ల‌తో ప్ర‌తియేటా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా, విద‌ర్భ, మ‌రాఠ్వాడా ప్రాంతాల‌కు చెందిన ల‌క్ష‌ల మంది పేషెంట్ల‌కు సేవ‌లు అందిస్తోంది.

ఈ ఆసుప‌త్రికి అన్ని ప్ర‌ధాన ఆరోగ్య‌బీమా సంస్థ‌ల‌తో ఒప్పందం ఉంది, హైద‌రాబాద్‌లోని అన్ని కార్పొరేట్ సంస్థ‌ల‌లో ఎంప్యాన‌ల్ అయింది. అడ్మిష‌న్ల‌కు ముందు, త‌ర్వాత అవ‌స‌ర‌మైన సేవ‌ల కోసం భార‌త్‌తో పాటు సార్క్ దేశాల పేషెంట్ల‌కు వీడియో క‌న్స‌ల్టేష‌న్ సేవ‌లను కూడా అందిస్తోంది.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడ‌ర్ అయిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌లో గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుపత్రి ఒక భాగం. అన్ని విభాగాల‌లో పూర్తిస్థాయి సేవ‌లు, నిబ‌ద్ధ‌త క‌లిగిన సిబ్బంది, అందరికీ అందుబాటులో ఉండ‌టం, నాణ్య‌త‌కు, భ‌ద్ర‌త‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టంతో ఐహెచ్‌హెచ్ ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన హెల్త్‌కేర్ స‌ర్వీసుగా నిలిచింది. జీవితాల‌ను స్పృశించి, చికిత్స‌ల‌ను సంపూర్ణంగా మార్చాల‌న్న ఏకైక ధ్యేయంతో ఈ నెట్‌వ‌ర్క్‌లోని ఆసుప‌త్రుల‌న్నీ క‌లిశాయి. గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుపత్రి గురించి మ‌రిన్ని వివ‌రాల‌కు చూడండి https://www.gleneaglesglobalhospitals.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here