OU LANDS KABZAA?
ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణ పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఆయన రాజ్ భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. తులసి కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో భూముల కబ్జా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర-రాష్ట్ర పెద్దల అండతో భూముల కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సర్వే డిపార్ట్మెంట్ తో భూముల సర్వే చేయించాలని తాము గవర్నర్ కి కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తి పై గవర్నర్ సానుకూలంగా స్పంరించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీ లను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. యూనివర్సిటీ లకు నిధులు ఇవ్వకుండా- ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుంటే పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రభుత్వ యూనివర్సిటీలను రక్షించాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.