కాశీంకి మావోలతో సంబంధాలు…

148
OU professor held for alleged Maoist links
OU professor held for alleged Maoist links

OU professor held for alleged Maoist links

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు గంటలు ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీం అరెస్ట్‌పై పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ నేపధ్యంలో పోలీసులు కాశీం అరెస్ట్ పై కౌంటర్ దాఖలు చేశారు.

ప్రొఫెసర్ కాశీం కేసులో పోలీసులు వేసిన  కౌంటర్‌ కాపీ సంచలనంగా మారింది . మావోజాలాన్ని విద్యార్థులకు ఎక్కించేందుకు కాశీం ప్రొఫెసర్‌ ముసుగు ధరించారని పోలీసులు తమ కౌంటర్ లో పేర్కొన్నారు . ఓయూలో ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నా  కాశీంనే  ఎందుకు అరెస్ట్‌ చేశామంటే ఆయనకు మావోలకు సంబంధాలు ఉన్నాయి కాబట్టే అని పేర్కొన్నారు. . లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులతో కాశీంకు సంబంధాలు ఉన్నట్లు తేలిందని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు.కాశీంతో పాటు మావోయిస్టు భావజాలం ఉన్నవారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ కౌంటర్ ఫైల్ లో పేర్కొన్నారు . కాశీం ‘నడుస్తున్న తెలంగాణ’ సంచికకు మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు చంద్రన్న నిధులు ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు . కాశీం ఇంట్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, సీడీలు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. ఎన్క్రిప్ట్ డేటా ఉండటంతో డేటా రిట్రీవ్ చేయడం సాధ్యపడటం లేదని పోలీసులు చెబుతున్నారు. సంభాషణల విషయంలో మావోయిస్టులు అభివృద్ధి చెందారని, డీకోడ్‌ చేయలేని విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

OU professor held for alleged Maoist links,telangana, Professor khasim

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here