లోకేష్ కుమార్ నిద్ర‌పోతున్నాడా?

136

లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం. అబిడ్స్ సర్కిల్ 14 లో గత పదిహేనేళ్ళగా స్యానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమేష్ యాదవ్. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమ గౌరీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేధించేద‌ని.. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో.. తనను ఉద్యోగం నుండి తొలిగించి , అన్యాయం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక కుటుంబం తో సహా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ర‌మేష్ యాద‌వ్ ఆత్మహ్యతకు యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం. ఇలాంటి ఉమ గౌరీలు ఎంత‌మంది జీహెచ్ఎంసీలో ఉన్నారో? దీర్ఘ‌కాలం తిష్ఠ వేసిన అధికారులంద‌రినీ బ‌దిలీ చేయాలని కేటీఆర్ ఎన్నిసార్లు చెప్పినా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు లేద‌నిపిస్తోంది. మ‌రి, లోకేష్ కుమార్‌ నిద్ర‌పోతున్నాడా అని న‌గ‌ర‌వాసులు ప్ర‌శ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here