ఈ యేడాది విరిసిన సినీ ప‌ద్మాలు

Padma award for cinema industry

భార‌త అత్యున్న‌త పౌర పురస్కారాల్లో ప‌ద్మ పురస్కారాలు ఒక‌టి. నిర్ణీత రంగంలో విశేష ప్ర‌తిభ క‌న‌ప‌రిచే వారికి ఈ ప‌ద్మ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తుంటుంది. అలాగే సినీ రంగంలో విశేష ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన కొంద‌రికి ఈ ఏడు.. 2019 గ‌ణతంత్ర్య వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో మ‌ల‌యాళ అగ్ర క‌థానాయ‌కుడు మోహ‌న్‌లాల్‌కు ప‌ద్మ భూష‌ణ్ అవార్డ్ వ‌చ్చింది. కాగా ప్ర‌ముఖ తెలుగు పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్రికి, డ్ర‌మ్స్ శివ‌మ‌ణికి, డ్యాన్స్ విభాగంలో ప్ర‌భుదేవాకి, గానంలో శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, న‌ట‌న‌లో మ‌నోజ్ బాజ్‌పాయ్‌ల‌ను ఈ అవార్డు వ‌రించింది. అయితే ప్ర‌ముఖ న‌టుడు ఖాద‌ర్‌ఖాన్‌కు మ‌ర‌ణాంత‌రం ప‌ద్మ‌శ్రీ అవార్డ

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article