ఏపీ పీసీపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు

Pallam Raju as AP PCC Chief

ఏపీ పీసీపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజును నియ‌మిస్తూ ఏఐసీసీ నిర్ణ‌యించింది. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం లో ఆయ‌న స‌హాయ మంత్రిగా ప‌ని చేసారు. తొలి నుండి ప‌ల్లంరాజు కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటోంది. ఆయ‌న తండ్రి సైతం మూడు సార్లు ఎంపీగా..కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. పీసీపీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఆయ‌న త‌న ప‌దవికి రాజీనామా చేసారు. దీంతో..ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందు కు తొలుత నేరుగా చిరంజీవికి రాహుల్ గాంధీ ఆఫ‌ర్ ఇచ్చినా..ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. మాజీ సీఎం కిర‌ణ్ పేరు ప‌రిశీలించారు. ఆయ‌న ముందుకు రాక‌పోవ‌టంతో.. కాపు వ‌ర్గానికి చెందిన ప‌ల్లంరాజుకు ఖ‌రారు చేసారు.
కొంత కాలంగా సాగుతున్న త‌ర్జన భ‌ర్జ‌న‌ల‌కు ముగింపు ప‌లుకుతూ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఒక నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజుకు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. ఏపీలో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కాపు వ‌ర్గ నేత ప‌ల్లంరాజుకు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప‌ల్లంరాజు కుటుంబం తొలి నుండి కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతోంది. ఆయ‌న తండ్రి సంజీవ‌రావు కాకినాడ నుండే మూడు సార్లు ఎంపీగా గెలిచి..కేంద్రంలో మంత్రిగానూ వ్య‌వ‌హ‌రించారు. ఇక ప‌ల్లంరాజు సైతం మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయ‌న మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం విదేశాంగ శాఖ స‌హాయ మంత్రిగా ప‌ని చేసారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నారు. ఆయ‌న కాంగ్రెస్ నుండి తిరిగి పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం పార్టీలో ఉంటున్నా..క్రియాశీల‌క రాజ‌కీయాల‌కూ దూరంగా ఉంటున్నారు. దీంతో..ర‌ఘువీరా తాను పీసీపీ చీఫ్‌గా కొన‌సాగ లేన‌ని స్ప‌ష్టం చేయ‌టంతో ఆయ‌న స్థానంలో ప‌ల్లంరాజుకు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించారు.
ఎన్నిక‌ల ముందు నుండి పీసీసీ చీఫ్‌ను మార్చే అంశం పైన ఏఐసీసీ క‌స‌రత్తు చేసింది. తొలుత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని స్వయంగా రాహుల్ గాంధీ కోరారు. అయితే, చిరంజీవి మాత్రం త‌న‌కు కొత్త బాధ్య‌త‌లు వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసారు. చిరంజీవి బీజేపీ వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం న‌డుమ ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. దీనికి త‌న‌కు ప‌ద‌వులు వ‌ద్ద‌ని..కాంగ్రెస్‌ను వీడ‌నంటూ రాహుల్‌కు హామీ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు ర‌ఘువీరా రాజీనామా త‌రువా త మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డిని పీసీసీ బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని ఢిల్లీ నుండి వ‌ర్త‌మానం అందింది. కానీ, అందుకు కిర‌ణ్ కుమార్ రెడ్డి అయిష్ట‌త వ్య‌క్తం చేసారు. ఏపీలో ఇప్పుడు పార్టీ ఉన్న ప‌రిస్థితుల్లో తాను బాధ్య‌త‌లు స్వీక రించ‌లేన‌ని స‌మాధానం ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో కిర‌ణ్ త్వ‌ర‌లోనే బీజేపీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఆయ‌న సోద‌రుడు కిషోర్ బీజేపీలో చేరటం ఖాయ‌మైంది. ఇక‌, పార్టీకి విధేయ‌డైన ప‌ల్లంరాజుకు పీసీసీ బాధ్య‌త‌లు అప్ప గించాల‌ని ఏఐసీసీ నిర్ణ‌యించింది.

Polical news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article