పంచాయితీ ఎన్నికలకు పరిశీలకులదే తుది నిర్ణయం

Pancayati elections The final decision of the observer

తెలంగాణా పంచాయితీ పోరుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇక గ్రామాల్లో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిచటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పంచ్యైటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో వుంది. ఇక తెలంగాణాలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకి సంబందించిన కీలక అంశాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వివరించారు. మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రతి జిల్లాకు కూడా సంబంధించిన పరిశీలకులను ఏర్పాటు చేయనున్నామని, ఎన్నికలకి సంబందించిన ప్రతి విషయం వారే చూసుకుంటారని, వారిదే తుది నిర్ణయమని నాగిరెడ్డి తెలిపారు. ఈ పంచాయితీ ఎన్నికలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు.
అవసరమైన మేరకు కాకా ఎక్కువ ఖర్చు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తిగా పాత పద్దతిలోనే కొనసాగుతాయని, ఉన్న పంచాయితీలను ఏకగ్రీవం చేయొద్దని, ఆలా చేస్తే కొత్త సమస్యలు వస్తాయని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ల పరిధిలో కోడ్‌ వర్తించదన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్‌, రేషన్ డీలర్లు కూడా పోటీ చేయొచ్చునని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ కూడా ముందుగానే పూర్తి చేస్తామని, ఈసారి ఓటర్లందరూ కూడా ఓటు వేసేలా చర్య తీసుకుంటామని నాగిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article