పంచాయితీ ఎన్నికల్లో ఓటేస్తే మధ్యవేలిపై సిరా చుక్క

Panchayathi Elections Voters will be marked in middle finger BY EC

మొన్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదోవెంటనే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఓట్లు వేసే వారికి ఓటేసిన గుర్తుగా వేలిపై సిరా చుక్క పెడతారు. అది కూడా ఏ యీనికలకు అయినా ఎడమచేతి చూపుడు వేలిపై సిరా చుక్క పెడతారు. అది చాలా కాలం పాటు చేరగా కుండా వుండ్తుంది. అలాగే దొంగ ఓట్లను వెయ్యటానికి వీలు కాకుండా వుంటుంది. అయితే తాజాగానే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపధ్యంలో ఎడమచేతి చూపుడు వేలిపై సిరా ఇంకా చెరిగిపోని కారణం గా ఎన్నికల కమీషన్ ఈ సారి ఒక కొత్త నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలకు ఎడమచేతి చూపుడు వేలుకు బదులుగా.. ఎడమచేతి మధ్యవేలికి సిరా గుర్తుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వేళ, చూపుడువేలుకు పెట్టిన సిరా ఇంకా ఎవ్వరికీ చెరిగిపోని కారణంతోనే పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలికి గుర్తును పెట్టాలంటూ ఎన్నికల కమిషనర్‌ ఈ ఆదేశాలు జారీ చేశారట. ఈమేరకు రిటర్నింగ్, ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్స్‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. అంటే.. పంచాయితీ ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తన ఎడమచేతి మిడిల్ ఫింగర్ చూపించాలని చెప్తోంది .
కాగా మూడంచెలుగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రాథమికంగా 35 గుర్తులను ఎలక్షన్ కమీషన్ కేటాయించటం జరిగింది. సర్పంచి పదవికి పోటీ పడే అభ్యర్థులకు 20, వార్డు సభ్యులకు 15 గుర్తులను కేటాయించింది ఈసీ. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ పడేవారికి బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టుమిషన్‌, బ్యాట్‌, పలక, బల్ల, బ్యాటరీ లైటు, బ్రష్‌, క్యారెట్‌, టేబుల్‌ బల్బు, దూరదర్శిని, చేతికర్ర, షటిల్‌, మొక్క జొన్న, నగరా, దువ్వెన, మంచం, కప్పుసాసరు, కొవ్వొత్తి తదితర గుర్తులను ఇచ్చింది. ఇక వార్డు సభ్యుల విషయంలో ఇస్త్రీ పెట్టె, పోస్టుబాక్సు, ఫోర్క్‌, చెంచా, జగ్గు, గౌను, స్టూలు, బీరువా, ప్రెషర్‌ కుక్కర్‌, విద్యుత్‌ స్తంభం, గ్యాస్‌ పొయ్యి, హార్మోనియం, టోపీ, ఐస్‌క్రీమ్ తదితర గుర్తుల నుంచి అభ్యర్థులు తమకు కావాల్సిన గుర్తును ప్రాధాన్యతా పూర్వకంగా ఎంచుకోవచ్చని తెలిపారు ఎన్నికల కమీషనర్. ఇక తెలంగాణా పంచాయితీ పోరులో ఓటేస్తే మధ్య వేలు చూపించాలనే నిర్ణయం వెనుక ఇంత కథ వుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article