పంచాయితీ పోరు.. రెండో విడత పోలింగ్ ప్రారంభం

Panchayati Poru

పంచాయితీ పోరు రెండో దశకు చేరుకుంది. పోలింగ్ రెండో ఘట్టం ఇవ్వాళ జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇక పోలింగ్ ప్రశాంతంగా జరగటం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా రెండో దశలో 4135 సర్పంచ్‌ స్థానాలకు 783 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,342 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 26, 191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగగా..రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదటి విడతలో వినియోగించిన బ్యాలెట్‌ పెట్టెలనే ఈ విడతలోనూ వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో పాల్గొన్న పోలింగ్‌ సిబ్బందే రెండో విడతలోనూ విధులు నిర్వహిస్తారు. మొదటి విడతలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article