పంచాయితీలను ఏకగ్రీవం చేస్తే ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న

Panchayatis Will be Onside EC should take action by Kodandaram

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తమ పార్టీ ఏ పార్టీలో విలీనం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ కార్యకర్తలు పోటీ చేస్తారని స్పష్టం చేసిన ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. ఇక పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా బరిలోకి దిగుతాము అన్నది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన ఆయన టిఆర్ఎస్ రాజకీయ ఒత్తిడితో చాలా గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేస్తుందని ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కోదండరాం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఎన్నికల సంఘం అధికారుల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని కోదండరాం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కమిషన్ తీరుపై ఉద్యమాలు జరగాల్సి ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని కోదండరాం కోరారు. తెలంగాణ జన సమితి ఏ పార్టీలోనూ విలీనం కానేకాదని స్పష్టం చేశారు ఆ పార్టీ చీఫ్ కోదండరాం. కూటమితో సంబంధం లేకుండా తమ వ్యూహం తమకు ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై త్వరలో ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జన సమితి కార్యకర్తలు పోటీ చేస్తారని కోదండరాం స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీలు సక్రమంగా పనిచేయడానికి నిధులు, విధులు ఇవ్వాలన్నారు. రాజకీయ ఒత్తిడితో ఏకగ్రీవాలు చేస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article