పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఏం చేశారంటే

Panchayiti Elections to lose the Elections

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలతాయా లేదో తెలియదు కానీ మంత్రతంత్రాలతో మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలు చేయొచ్చని భావించారట గ్రామంలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన వ్యక్తి ఓడిపోవాలని ఏకంగా వారి ఇంటి ముందే కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో పూజలు చేసి వెళ్లిపోయారట. చిత్రంగా అనిపిస్తుందా… ఇది ఆలేరు మండలం రఘునాథపురం చోటు చేసుకున్న పంచాయతీ ఎన్నికల విచిత్రం.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారు అభ్యర్థులు. అయితే ఓ గ్రామంలో మాత్రం వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్థి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లతో దర్శనం ఇచ్చాయి. ఇక దీంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు కాలనీ వాసులు.
ఈ సంఘటన ఆలేరు మండలం రఘనాథపురంలో చోటుచేసుకుంది. రఘనాథపురం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేశ్ ఈ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి నాగేశ్ ఇంటి ముందు మంత్రాలు చేసిన గుడ్డు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు ప్రత్యేక్షమయ్యాయి. ఇగ దీంతో ఆ కాలనీ వాసులు భయందోళనకు గురవుతున్నారు. మరీ ఎన్నికల్లో ఓడించేందుకే పన్నగం పన్నారా లేక మరేవిధంగానైనా కుటుంబాన్ని నష్ట పరిచేందుకు చేశారా అని ఆ గ్రామస్థులు గుసగుసలాడుతున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article