Parasuram to direct Mahesh Babu
ప్రిన్స్ మహేష్ బాబు తన 27వ సినిమాకి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం అయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. అయితే మహేష్ తదుపరి చిత్రంపై ఇప్పటినుండే చర్చ మొదలైంది. ఈ సమయంలో మహేష్ 27వ సినిమా నాతోనే అంటూ ప్రకటించారు సెన్సేషన్ డైరెక్టర్ పరశురామ్. యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అయన గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక అయన తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తోనే అంటూ మీడియా ముందర ప్రకటించాడు. దీంతో మహేష్ 27వ సినిమా ఎవరితో అన్న చర్చకు తేరా పడింది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.