త్వరలో భీమవరంలో పవన్ పర్యటన

PAVAN BHIMAVARAM TOUR FINALISED

ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతరం జనంలోనే ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. జనసేన బలోపేతానికి అందరి సూచనలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి ఇందులో చర్చించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చినట్లు మనోహర్ వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో పవన్‌ భీమవరంలో పర్యటిస్తారని తెలిపారు. పార్టీ కోసం పని చేసి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారని వివరించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article